Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...

Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...

మనము ఎన్ని పనుల్లో ఉన్నా.. పిల్లలు ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. ఏ ప్రదేశంలో ఆడుకుంటున్నారు అనే విషయాలు ఒక కంటితో కనిపెడుతూనే ఉండాలి.  లేదంటే వారికి తెలియదు కదా.. ఎక్కడ ఎలా ఉంటుందో ..  చిన్నారులు ఒక్కోసారి తెలియకుండానే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు  మనమే కాదు ఆ చిన్నారి పరిస్థితి చూసిన వారు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు దాపురిస్తాయి.. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు చెన్నైలో చోటు చేసుకుంది. . వివరాల్లోకి వెళ్తే.. 

సాధారణంగా అపార్ట్​ మెంట్స్​ లో ఉండే రక్షణ ఉంటుంది. అయితే పిల్లలను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎంత రక్షణ అని భావిస్తామో.. అంతే ఇబ్బంది ఉంటుంది.  బాల్కనీలో పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఆమరుపాటుగా ఉన్న పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.  చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి చిన్నారి సన్ షెడ్ పై పడిన ఘటన జనాలకు ఉత్కంఠకు గురిచేసింది. అపార్ట్ మెంట్ రెండో అంతస్తులో ఉంటున్న పాప ఈరోజు  ( ఏప్రిల్​ 28)ఉదయం అనుకోకుండా బాల్కనీ నుంచి సన్ షెడ్ పై పడిపోయింది. దీంతో ఎటు వెళ్లాలో తోచక ఇబ్బంది పడింది. వెంటనే గమనించిన పేరెంట్స్, ఇరుగుపొరుగు అలర్ట్ అయ్యారు. కొంతమంది కలిసి చిన్నారిని రక్షించగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ మేరకు పాప కిందపడకుండా ముందుగా పెద్ద క్లాత్ తెచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించారు.  ఈలోగా పాప కిందకు జారిపోతూవుంది. ఇంతలో కింద ఉన్న కొందరు తమ ఇంటి కిటికీలోంచి ఎక్కి చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు.  కానీ రెండో అంతస్తు నుంచి కూడా పైకి వచ్చి పట్టుకోలేకపోయాడు. అయితే పక్కనే ఉన్న మరో వ్యక్తి కిటికిలోంచి మరొకరిని ఎత్తుకోగా సదరు వ్యక్తి ఒంటిచేత్తో జారిపోతున్న పాపను జాత్రత్తగా పట్టుకుని కిందనున్నవాళ్లకు అందించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ప్రజల నుంచి అక్కడి స్థానికులు ప్రశంసలు అందుకుంటున్నారు.