Divya Pillai: లిప్లాక్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు.. నటి దివ్య పిళ్ళై షాకింగ్ కామెంట్స్

Divya Pillai: లిప్లాక్ సీన్స్ చేయడం అంత ఈజీ కాదు.. నటి దివ్య పిళ్ళై షాకింగ్ కామెంట్స్

మలయాళ నటి దివ్య పిళ్ళై(Divya Pillai) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సినిమాల్లో లిప్ లాక్ సీన్స్, ఆ సీన్స్ లో నటించడంపై ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ముద్దు సీన్స్ చేయడం అంత ఈజీ కాదని, మనకు నచ్చకున్నా చేయాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దివ్య పిళ్ళై తెలుగులో నటించిన సినిమా మంగళవారం. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమాలో దొరసాని పాత్రలో కనిపించి చివర్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే పాత్రలో ఆకట్టుకున్నారు దివ్య పిళ్ళై. ఈ సినిమా సక్సెస్ తో ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. తాజాగా ఆమె తెలుగు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆమె లిప్ లాక్ సీన్స్ చేయడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 

రొమాంటిక్ సీన్స్ అనగానే ఆడియన్స్ చాలా ఈజీగా చూస్తూరు. ఏముంది.. ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడమే కదా అనుకుంటారు. కానీ.. షూటింగ్ సెట్స్‌లో అందరిముందు అలాంటి సీన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దాదాపు 75 కేజీల బరువున్న వ్యక్తి మనపై పడుకుని ఉండగా.. కెమెరాకు కనిపించేలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో మైండ్‌లో ఎలాంటి ఆలోచన ఉండదు. ఆ ముద్దుని ఎంజాయ్ చేయడం కూడా ఉండదు. దీనిబట్టి ఆ సీన్స్ చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. నిజానికి.. అలాంటి సీన్స్ చేయడం కోసం ముందు ప్రిపేర్ అవ్వాలి, నటుడితో డిస్కస్ చేయాలి. ఒకవేళ ఇబ్బంది అనిపించినా.. మొహంలో ఆ ఫీలింగ్ కనిపించకూడదు.. అంటూ  చెప్పుకొచ్చారు దివ్య పిళ్లై. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.