కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ రూ. 3.22 లక్షల కోట్లే

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ రూ. 3.22 లక్షల కోట్లే
  • ప్యాకేజీపై చర్చకు కేంద్రం సిద్ధమా అని ప్రశ్నించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అంటూ చేస్తున్న ప్రచారమంతా అబద్దమని కాంగ్రెస్ విమర్శించింది. జీడీపీ లో 10 శాతం అంటూ ప్రజలను కేంద్రం మోసం చేస్తుందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేంద్రం ప్రకటించింది నికరంగా రూ. 3.22 లక్షల కోట్లు మాత్రేనని ఆయన చెప్పారు. ఇది జీడీపీ లో 1.6 శాతం మాత్రమేనని అన్నారు. దీనిపై కేంద్రం చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రజలకు అబద్దాలు చెప్పటం మాసేసి…ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారో చెప్పాలని కోరారు. దేశ వ్యాప్తంగా వలస కూలీలు కాలి నడక వెళ్తూ పడుతున్న కష్టాలు దారుణంగా ఉన్నాయని వీటిని మోడీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. మైగ్రెంట్ వర్కర్స్ ను ఆదుకోవటంలో కేంద్రం పూర్తిగా విఫలమైందంటూ ఆయన విమర్శించారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ఏం చేస్తారో చెప్పాలని ఆనంద్ శర్మ కోరారు.