వివాదాల సంగతి ఎలా ఉన్నా, ‘పబ్జి’ గేమ్ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. అత్యంత ఆదరణ పొందిన ఈ గేమ్ ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు తయారీదారులు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ దేశాల్లో ‘పబ్జి’ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. తాజాగా మన దేశంలో ‘ద పబ్జి మొబైల్ ఇండియా టూర్ 2019’ను ప్రారంభించారు. పబ్జి గేమ్ ఆడే ప్లేయర్స్ అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. గేమ్ ఆడే వాళ్లు తమ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసుకుని, వేరే స్క్వాడ్స్‌తో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా అనేక దశల్లో, నాలుగు నెలలపాటు ఈ టోర్నమెంట్ సాగుతుంది. ఇతర స్క్వాడ్లను ఓడించి ఫైనల్‌కు చేరుకోవచ్చు. అలాగే జైపూర్, గౌహతి, పుణె, విశాఖపట్నంలలో రీజనల్ ఫైనల్స్ నిర్వహిస్తారు. వీటిలో గెలిచిన వాళ్లను ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. అక్టోబర్‌లో కోల్‌కతాలో ఫైనల్ జరుగుతుంది. నాలుగునెలలపాటు జరిగే ఈ ఆన్లైన్ టోర్నమెంట్లో విజేతకు 1.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందించనున్నారు.
