టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఎంచుకున్న మార్గం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది.
ముంబైలో ‘అరెస్ట్’ డ్రామా!
ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ ఒక పోలీస్ వ్యాన్‌లో వచ్చారు. అయితే మృణాల్ ఠాకూర్ చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి ఉండటం చూసి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ‘అరెస్ట్’ సీన్‌ను మరింత రక్తి కట్టించడానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించారు. ఆయనే స్వయంగా మృణాల్‌ను వ్యాన్ నుంచి కిందకు దించి, వేదిక వైపు నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
►ALSO READ | అల్లరి నరేశ్ ‘కనక దుర్గ’ గ్రాండ్ లాంచ్.. ఒకే ఫ్రేమ్‌లో తళుక్కుమన్న టాలీవుడ్ స్టార్ లేడీస్!
నేర ప్రపంచం.. రివెంజ్ డ్రామా!
మొదట ఇది నిజమైన అరెస్ట్ అని కొందరు భ్రమపడినా, ఆ తర్వాత ఇది సినిమా థీమ్‌లో భాగమని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా నేర ప్రపంచం, గన్ కల్చర్ , తీవ్రమైన రివెంజ్ డ్రామా నేపథ్యంలో సాగనుంది. అందుకే సినిమా మూడ్‌ను ప్రేక్షకులకు ముందే పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ వెరైటీ ప్రమోషన్ ప్లాన్ చేశారు. సాధారణంగా సినీ సెలబ్రిటీలు లగ్జరీ కార్లలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తారు. కానీ, ‘డెకాయిట్’ టీమ్ మాత్రం ట్రెండ్‌కు భిన్నంగా, అందరినీ విస్మయానికి గురిచేస్తూ ఈ సాహసోపేతమైన పబ్లిసిటీ స్టంట్ చేసింది.
Under arrest for killing it with their performances 💥@AdiviSesh, @mrunal0801 & @anuragkashyap72 make a striking entry at the #Dacoit Hindi Trailer Launch event ❤️🔥
— Annapurna Studios (@AnnapurnaStdios) April 4, 2026
Watch live now!
▶️ https://t.co/LhqiPBR6w5#DacoitTrailer out shortly.#Dacoit GRAND RELEASE WORLDWIDE ON APRIL… pic.twitter.com/eRMYfrhGUH
భారీ అంచనాలతో..
ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. అడివి శేష్‌కు ఇది నేరుగా బాలీవుడ్‌లోకి ఘనమైన ఎంట్రీ అని చెప్పొచ్చు. మృణాల్ ఠాకూర్ తొలిసారిగా ఇలాంటి మాస్ అండ్ యాక్షన్ రోల్ చేస్తుండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కేవలం దర్శకుడిగానే కాకుండా, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో అనురాగ్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ 'హ్యాండ్‌కఫ్స్' వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్ అంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
