యూపీ టాపర్‌ మృతికి కారణం ఆకతాయిలు కాదట!

యూపీ టాపర్‌ మృతికి కారణం ఆకతాయిలు కాదట!

ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం సొంతవాళ్లు ఆడిన నాటకం: పోలీసులు
వేధింపులకు సంబంధించి ఆధారాలు దొరకలేదని వెల్లడి
ఫ్యామిలీమెంబర్లు నిజాలు వక్రీకరించారని ఆరోపణ
యూపీలోని బులంద్ షహర్ జిల్లాకు చెందిన స్టూడెంట్ సుదీక్ష భాటి(20) డెత్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సోమవారం జరిగిన ‘యాక్సిడింట్’ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు నిజాలను వక్రీకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. సుదీక్ష ఫ్యామిలీ చెబుతున్నట్లుగా.. వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు. సుదీక్షకు సంబంధించిన వ్యక్తులు ‘ఇన్సూరెన్స్ డబ్బు’ గురించి ఆలోచించారని, అందుకే యాక్సిడెంట్ పై కథలు అల్లారని ఆరోపించారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ మొత్తం వ్యవహారంలో చాలా తేడాలు ఉన్నాయని అంటున్నారు.

బైక్ నడిపింది మైనర్..
‘‘ఆ అమ్మాయికి భారీ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తోంది. అదీకాక ఆమె ఇన్సూరెన్స్ డ‌బ్బు గురించి ఆలోచించారు’’ అని పోలీసు ఆఫీసర్ సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు. ‘‘యాక్సిడెంట్ జరిగిన టైంలో సుదీక్ష కజిన్ (మైనర్) బైక్ నడుపుతున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు సుదీక్ష అంకుల్ సతేంద్ర భాటి దాద్రిలో ఉన్నాడు. ఘటన జరిగిన 2 గంటల తర్వాత అక్కడికి వచ్చాడు. పోలీసులను బ్లేమ్ చేసేందుకు ఒక కథ అల్లారు. మా దర్యాప్తులో ఎక్కడా.. వేధింపులకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు’’ అని చెప్పారు. సుదీక్ష తండ్రి బ్రహ్మ సింగ్ భాటి కూడా కంప్లైంట్ లో వేధింపుల గురించి ప్రస్తావించలేదని యూపీ పోలీసు వర్గాలు చెప్పాయి. రాష్ డ్రైవింగ్ వల్లే తన కూతురు చనిపోయిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారని వెల్లడించాయి.

సుదీక్ష అంకుల్ చెప్పిందిదీ..
2018లో సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 98 శాతం మార్కులతో సుదీక్ష బులంద్ షహర్ జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అమెరికా లోని మసాచుసెట్స్లో బాబ్సన్‌ కాలేజీ నుంచి రూ.3.8 కోట్ల స్కాలర్ షిప్ పొందింది. కరోనా నేపథ్యంలో అమెరికా నుంచి ఈ మధ్య
సొంతూరుకు వచ్చింది. ఈ నెలలో అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో బంధువుల ఇంటికి వెళ్లొస్తామని బయలుదేరినట్లు సుదీక్ష అంకుల్ చెప్పారు. తను, సుదీక్ష, ఆమె కజిన్.. ముగ్గురం బైక్ పై వెళుతుండగా.. బుల్లెట్ బండిపై ఇద్దరు వ్యక్తులు తమ వెంట పడ్డారని చెప్పారు. చాలా దూరం వెంటాడుతూ తమను వేధించారని, తమ ముందు బైక్ తో స్టంట్స్ చేశారని చెప్పారు.
తమను ఢీకొట్టాలని చూడగా.. తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగిందని వివ‌రించారు. బైక్ పక్కకు దూసుకెళ్లి చెట్టును తాకడంతో సుదీక్షతో పాటు తామిద్దరం కూడా కిందపడ్డామని, సుదీక్ష తలకు బలమైన గాయం తగిలిందని తెలిపారు.