నేను మీకు బాగా కావాల్సిన వాడిని..ఫన్ ఎంటర్టైనర్

నేను మీకు బాగా కావాల్సిన వాడిని..ఫన్ ఎంటర్టైనర్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఇరగదీస్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్..ఎస్ఆర్ కళ్యాణ మండపంతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మనోడికి ఆఫర్లు పెరిగిపోయాయి. తాజాగా సమ్మతమే అంటూ తెలుగు అభిమానులను పలకరించి..విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నేను మీకు బాగా కావాల్సిన వాడినంటూ కిరణ్ అబ్బవరం వస్తున్నాడు. తాజాగా  ఈ మూవీ టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. 

 ఈ టీజర్లో తన బాడీ లాంగ్వేజ్, సెటైర్లతో కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కిరణ్ టాక్సీ డ్రైవర్గా నటిస్తుండగా...తనదైన డైలాగులతో ప్రేక్షకులకు మాంచి కిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. అంత ఆహ్లాదకరమైన కుటుంబం మీకు ఉన్నప్పుడు అందరూ కలిసి సరదాగా ఉగాది పచ్చడి తినకుండా ఇంతదూరం వచ్చి ఇంతలా ఎందుకు తాగుతున్నారు, ఒక్క ప్రేమకే మీరిలా అయిపోతే ఎలా మేడమ్, పదిసార్లు ప్రేమలో ఓడిపోతే పదకొండోసారి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నా అంటూ కిరణ్ చెప్పే డైలాగులు అదరిపోయాయి. ఇవే కాదు..యావరేజ్గా ఉన్న అమ్మాయిల విలువ నాలా  కరువులో ఉన్నోడికి తెలుస్తుంది కానీ.. నీలా కడుపు నిండినోడికి ఏం తెలుస్తుందనే పంచ్ డైలాగ్ లకు ఈ చిత్రంలో కొదవలేదు. ఇక ఈ సినిమాలో బాబా భాస్కర్ తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అటు హీరోయిన్ సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ క్యూట్గా నటించారు. మొత్తంగా టీజర్ను చూస్తుంటే మూవీలో పుష్కలమైన ఎంటర్ టైన్ మెంట్ ఉందని అర్థమవుతుంది.  

నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాకు శ్రీధర్ గాదే దర్శకత్వం వహించారు.  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన  చిత్రానికి  మణిశర్మ సంగీతం అందించగా.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా..విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.