సలార్ టీమ్ కొత్త స్ట్రాటజీ.. సిగ్నల్ వచ్చేవరకు నో ఇంటర్వ్యూస్

సలార్ టీమ్ కొత్త స్ట్రాటజీ.. సిగ్నల్ వచ్చేవరకు నో ఇంటర్వ్యూస్

ప్రస్తుత కాలంలో సినిమా తీయడమే కాదు.. ఆ సినిమాను ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం కూడా పెద్ద టాస్క్ గా మారింది మేకర్స్ కు. అందుకోసం చిత్ర విచిత్రమైన స్ట్రాటజీలు ఫాలో అవుతుంటారు. కొత్త కొత్త ప్రమోషన్స్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు. తాజాగా సలార్(Salaar) టీమ్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా.. సలార్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానూలు కూడా అదే రేంజ్ ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సలార్ టీమ్ సరికొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని సమాచారం. అదేంటంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకు చిత్ర యూనిట్ ఎలాంటి ఇంటర్వ్యూస్ పాల్గొనకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దానికి కారణం సలార్ సినిమా కథ లీక్ అవుతుందనే అనుమానమాట. అందుకే ట్రైలర్ రిలీజ్ వరకు చిత్ర యూనిట్ ఎలాంటి ఇంటర్వ్యూస్ పాల్గొనకూడదని కండీషన్ పెట్టారట. 

ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మాత్రం షాకవుతున్నారు. ప్రజెంట్ సిచువేషన్ లో ఇంటర్వ్యూస్ అనేవి ప్రమోషన్స్ లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. చిత్ర యూనిట్ పాల్గొనే ఇంటర్వ్యూస్ ను చూడటానికి ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి వాటినే లేట్ గా స్టార్ట్ చేస్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ స్ట్రాటజీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.