ఓటమి తప్పించుకున్న తెలుగు టైటాన్స్‌

ఓటమి తప్పించుకున్న తెలుగు టైటాన్స్‌
  • తలైవాస్​తో మ్యాచ్​ టై
  • యు ముంబా, బెంగాల్‌‌ బోణీ

బెంగళూరు: రెండేళ్ల గ్యాప్‌‌‌‌ తర్వాత వచ్చిన ప్రొ కబడ్డీ లీగ్‌‌కు అద్భుత ఆరంభం. ఎనిమిదో సీజన్‌‌ ఫస్ట్‌‌డే యాక్షనే సూపర్‌‌ హిట్‌‌ అయింది. తొలి రోజు మూడు మ్యాచ్‌‌ల ‘ట్రిపుల్ పంగా’ ఫ్యాన్స్‌‌కు కిక్‌‌ ఇచ్చింది. ఈసారైనా టైటిల్‌‌ నెగ్గాలన్న టార్గెట్‌‌తో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్‌‌.. రైడర్‌‌ సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌ (11 పాయింట్లు)  సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌తో ఓటమి తప్పించుకొని టైతో కొత్త సీజన్‌‌ను షురూ చేసింది. తెలుగు టైటాన్స్‌‌–తమిళ్‌‌ తలైవాస్‌‌ మధ్య లాస్ట్‌‌ సెకండ్‌‌ వరకూ థ్రిల్లింగ్‌‌గా సాగిన మ్యాచ్‌‌40–40 టై అయింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 32–38తో ఓటమి ముంగిట నిలిచిన టైటాన్స్‌‌ను స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ సిద్దార్థ్‌‌ గట్టెక్కించాడు. ఓ సూపర్‌‌ రైడ్‌‌తో మూడు పాయింట్లు అందించి టీమ్‌‌ను ట్రాక్‌‌లోకి తెచ్చాడు. ఆ వెంటనే  తలైవాస్‌‌ను ఆలౌట్‌‌ చేసిన టైటాన్స్‌‌  39–38తో లీడ్‌‌లోకి వచ్చింది.  కానీ, ఓ రైడ్‌‌ పాయింట్‌‌ గెలిచిన తమిళ్‌‌ టీమ్‌‌ తర్వాత సిద్దార్థ్‌‌ను టాకిల్‌‌ చేసి 40–39తో మళ్లీ ఆధిక్యం సాధించింది. చివరి సెకండ్లలో రెండు టీమ్స్‌‌ ఎమ్టీ రైడ్స్‌‌ చేశాయి. అయితే, డూ ఆర్‌‌ డై అయిన లాస్ట్‌‌ రైడ్‌‌కు వచ్చిన తమిళ్‌‌ తలైవాస్‌‌ ప్లేయర్‌‌ మన్‌‌జీత్‌‌ను ట్యాకిల్‌‌ చేసిన తెలుగు టీమ్‌‌ మ్యాచ్‌‌ను టైగా ముగించింది. అంతకుముందు సిద్దార్థ్‌‌తో పాటు రజ్‌‌నీశ్‌‌ (6 పాయింట్లు) సత్తా చాటడంతో  9వ నిమిషంలోనే తలైవాస్‌‌ను ఆలౌట్‌‌ చేసి 12–5తో లీడ్‌‌ సాధించిన టైటాన్స్‌‌ తర్వాత డీలా పడింది. పుంజుకున్న తలైవాస్‌‌ 23–21తో  ఫస్టాఫ్‌‌ను ముగించింది. సెకండాఫ్‌‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ముందంజ వేసినా చివర్లో డీలా పడ్డది.  టైటాన్స్‌‌ టీమ్‌‌లో డిఫెండర్లు సందీప్‌‌ కండోలా (5), అరుణ్‌‌ (3) కూడా రాణించారు. ఇక, అభిషేక్‌‌ సింగ్‌‌ 19 పాయింట్లతో చెలరేగడంతో ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో యు ముంబా 46–30తో బెంగళూరు బుల్స్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీతో బోణీ కొట్టింది. మూడో మ్యాచ్‌‌లో బెంగాల్‌‌ వారియర్స్‌‌ 38–33తో యూపీ యోధాపై గెలిచింది. 

చరణ్‌‌, ఎన్టీఆర్‌‌ కామెంటరీ

పీకేఎల్‌‌ ఫస్ట్‌‌ డేను తెలుగు ఫ్యాన్స్‌‌ మరింత ఎంజాయ్‌‌ చేశారు. తొలి మ్యాచ్‌‌ (ముంబా–బెంగళూరు)కు టాలీవుడ్‌‌ టాప్‌‌ హీరోలు రామ్‌‌చరణ్‌‌, జూ. ఎన్టీఆర్‌‌ కామెంటరీ చెప్పి ఆకట్టుకున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ మూవీ ప్రమోషన్స్‌‌లో భాగంగా డైరెక్టర్‌‌ రాజమౌళితో కలిసి బ్రాడ్‌‌కాస్టర్‌‌ స్టార్‌‌ స్పోర్ట్స్‌‌ స్టూడియోకు వచ్చి ముచ్చటించారు. తర్వాత చరణ్‌‌, ఎన్టీఆర్‌‌ తెలుగు, తమిళ్,​ కన్నడ, హిందీలో కామెంటరీ చెప్పారు. 

నేటి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌లు

గుజరాత్‌‌ x జైపూర్‌‌ పింక్‌‌ పాంథర్స్‌‌

దబాంగ్‌‌ ఢిల్లీ x పుణేరి పల్టాన్‌‌

హర్యానా స్టీలర్స్‌‌ x పాట్నా పైరేట్స్‌‌

రా. 7.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో