వహ్‌.. తాజ్‌!: ట్రంప్ వస్తుండని దుమ్ము దులిపిండ్రు

వహ్‌.. తాజ్‌!: ట్రంప్ వస్తుండని దుమ్ము దులిపిండ్రు

ట్రంప్ దంపతులు తాజ్ మహల్ వస్తుండడంతో క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టారు అక్కడి సిబ్బంది. తాజ్ పరిసరాల్లోని చెత్తను శుభ్రం చేస్తున్నారు. వాటర్ పూల్ ను క్లీన్ చేశారు. మహల్ పరిసరాల్లోని పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. తాజ్ మహల్ సుందరీకరణ చేపట్టారు. ఈనెల 24న 4 గంటల సమయంలో మెలానియాతో కలిసి ట్రంప్ తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.


గంట సేపు అక్కడే ఉండనున్నారు. దీంతో పక్కనే ఉన్న యమునా నదిలో కాలుష్యం లేకుండా పైన ఉండే రిజర్వాయర్ నుంచి మొన్ననే నీటిని విడుదల చేశారు. గతంలో వచ్చిన ఒబామా చివరి నిమిషంలో తాజ్ మహల్ పర్యటన రద్దు చేసుకున్నారు.

see also: సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు

చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం