జూబ్లీహిల్స్ పరిధిలోని హైలో డిజైన్ స్టోర్లో చోరీ...3 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు ఎత్తుకెళ్లిన దొంగలు

జూబ్లీహిల్స్ పరిధిలోని హైలో డిజైన్ స్టోర్లో చోరీ...3 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు ఎత్తుకెళ్లిన దొంగలు
  •     గదిలో మేకులు గుచ్చిన నిమ్మకాయలు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఉన్న హైలో డిజైన్ స్టోర్​లో చోరీ జరిగింది. స్టోర్ యజమాని మౌన్న గుమ్మడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న రాత్రి షాపును లాక్ చేసి వెళ్లిన ఉద్యోగులు.. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా షాపు తాళాలు తీసి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా 3 ల్యాప్​టాప్‌‌లు, 2 ఐప్యాడ్​లు, మొబైల్ ఫోన్, పంచ్ మెషీన్, ఏసీ రిమోట్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. 

గదిలో బట్టలు చెల్లాచెదురుగా ఉండటంతో పాటు మేకులు గుచ్చిన నిమ్మకాయలు కనిపించడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.