కూకట్‌పల్లిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

కూకట్‌పల్లిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

హైదరాబాద్ : KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి ప్రయత్నించారు దొంగలు. హైదర నగర్ హనుమాన్ మందిర్ పక్కనే ఉన్న ఐసీఐసీఐ ఏటీఎంను పగలగొట్టి..డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అలారం మోగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి..సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.