వీడియో: ATM పగులకొట్టేందుకు దొంగ చేసిన ప్రయత్నం..

వీడియో: ATM పగులకొట్టేందుకు దొంగ చేసిన ప్రయత్నం..

సిరిసిల్ల: ఏటీఎంను పగులకొట్టి దొంగతనం చేయాలనుకున్న ఓ దొంగ ప్రయత్నం విఫలమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని లక్ష్మీ విలాస్ బ్యాంకుకు చెందిన ఏటీఎంను పగులకొట్టి నగదును తీసుకోవడానికి చూశాడు ఓ దొంగ. నడి రాత్రి ఒంటిగంటకు దొంగతనం చేయడానికి ఏటీఎం లోకి వెళ్లాడు. అయితే ఏటీఎంను పగులకొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా ఆ ఏటీఎం పగులకపోగా… సీసీకెమెరాలో అతను చేసిన దొంగతనం పూర్తిగా రికార్డ్ అయింది.

కెమెరాను చూసిన దొంగ.. పేపర్లతో కెమెరాను కవర్ చేయబోయాడు. నడిరాత్రి ఒంటిగంట నుంచి పొద్దున ఆరు గంటల వరకు దొంగతనం చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇక చేసేదేమి లేక పొద్దున అక్కడినుంచి వెళ్లిపోయాడు. బ్యాంకువాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.