న్యూఢిల్లీ: కాక్రోచ్జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరుగుతున్న నిరసనలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లు తేలితే వారి పాస్‌పోర్టులు రద్దయ్యే చాన్స్ ఉందని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
నిరసనలో అల్లర్లు, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డింగ్‌లు, టెక్నికల్ ఆధారాల ద్వారా గుర్తిస్తున్నామన్నాయి. ఎవరైనా హింసలో పాల్గొంటే చట్ట ప్రకారం వారి పాస్‌పోర్టులను రద్దు చేయవచ్చని వెల్లడించాయి.
