వలస కూలీల తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి బస్సులు

వలస కూలీల తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి బస్సులు

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో.. రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేందుకు పని లేక…చేతిలో డబ్బుల్లేక బతకడం కష్టంగా మారుతోంది. దీంతో పట్టణాల్లో బతకలేమని రోజువారి కూలీలు.. తమ గ్రామాలకు పయనమవుతున్నారు. ఢిల్లీలో ఉంటున్న రోజువారి కూలీలు.. ఉత్తరప్రదేశ్ , లక్నో, ఖానాపూర్,  బీహార్, పాట్నా ఇంకా చాలా ప్రాంతలా వారు సొంత గ్రామాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. కరోనాతో బస్సులు, ట్రైన్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కార్మికులు ఆనంద్ విహార్ బస్ స్టేషన్ ముందు పడిగాపులుగాస్తుంటే..మరికొందరు కాలినడకన సొంత గ్రామాలకు బయల్దేరారు.

వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా 1000 బస్సులను సిద్ధం చేసింది. ఆ బస్సుల్లో కూలీలను స్వస్థలాలకు చేర్చాలని ఆదేశించింది. కాలినడకన వెళ్తున్న కూలీలకు  స్థానికులు స్నాక్స్‌, వాటర్‌ అందజేశారు.