ఒక్క విమానం పెండింగ్.. పూర్త‌యిన‌ రాఫెల్ ఒప్పందం

ఒక్క విమానం పెండింగ్.. పూర్త‌యిన‌ రాఫెల్ ఒప్పందం

భార‌త్ - ఫ్రాన్స్ దేశాల మ‌ధ్య ఏర్ప‌డిన రాఫెల్ ఒప్పందం పూర్త‌య్యింది. ఫ్రాన్స్ నుంచి తాజాగా మ‌రో మూడు రాఫెల్ విమానాలు టేకాఫ్ అయ్యాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు మంగళవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నాయి. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్, ఫ్రాన్స్ మధ్య రూ. 60,000 కోట్ల ఒప్పందం ఏర్ప‌డింది. అయితే మ‌రో విమానం మాత్రం భారత వైమానిక దళం (IAF)లో చేరడానికి  మిగిలి ఉంది.

ఫ్రాన్స్ నుండి మూడు రాఫెల్ యుద్ధ విమానాలు నిన్న సాయంత్రం భారతదేశానికి చేరుకున్నాయి. ఈ విమానాలకు యుఎఇ వైమానిక దళం ఏరియల్ రీఫ్యూయలింగ్ సపోర్ట్ అందించింది. ఈ మూడు విమానాల రాకతో, ఒప్పందంపై సంతకం చేసిన 36 రాఫెల్‌లలో 35  రాఫెల్ యుద్ధ విమానాలు  భారత్‌కు అందాయి. 36వ విమానం మార్చి-చివరి లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి చేరుకుంటుంద‌ని ప్రభుత్వ అధికారులు తెలిపారు. భారతదేశం సెప్టెంబరు 2016లో ఫ్రాన్స్ నుండి 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఆర్డర్ చేసింది. 

అయితే మిగిలిన ఒక్క విమానాన్ని మాత్రం భారత అధికారుల సూచన మేరకు..ప్రత్యేకంగా తయారు చేశారు.  ఇప్పటి వరకు అన్ని యుద్ధ విమానాలు భారత్ కు నేరుగా డెలివరీ చేయబడగా.. ఈ చివరి విమానాన్ని మాత్రం ఫ్రాన్సులో భారత అధికారులకు అప్పగించనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల రాక‌తో  ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు మ‌రింత సామార్థ్యం పెరిగింద‌ని భావిస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చ‌ద‌వండిః

ప్రియాంక గాంధీకి బీజేపీ కార్య‌క‌ర్త షేక్ హ్యాండ్

రేపు జగ్గారెడ్డి కీలక సమావేశం