టిక్‌‌టాక్‌‌లో బాలీవుడ్ హవా

టిక్‌‌టాక్‌‌లో బాలీవుడ్ హవా
  • ఇన్‌‌ఫ్లుయెన్షియర్స్ వీడియోలు   
  • తక్కువ టైమ్‌‌లోనే.. ఎక్కువ మందికి రీచ్

న్యూఢిల్లీ :ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే.. రోడ్లపై పెద్ద పెద్ద హోర్డింగ్స్, టీవీల్లో యాడ్స్‌‌కే పరిమితం. దశాబ్ద కాలంగా ఈ ట్రెండే నడిచింది. కానీ సినీ ప్రమోషన్లలో నయా ట్రెండ్ వచ్చేసింది. ఈ మధ్యన షార్ట్ వీడియో యాప్‌‌గా ఫుల్ పాపులారిటీ సాధించిన టిక్‌‌టాక్‌‌ను బాలీవుడ్ మార్కెటర్లు, ప్రమోటర్లు సినిమా ప్రమోషన్ కోసం చాలా చక్కగా వాడేసుకుంటున్నారు. బాలీవుడ్‌‌లో కొత్తగా విడుదలవుతోన్న ప్రతి సినిమా కూడా టిక్‌‌టాక్‌‌లో ప్రమోషన్ కోసం చక్కర్లు  కొడుతోంది. ఆ సినిమాల్లో పాటలకు టిక్‌‌టాక్ సెలబ్రిటీలు డ్యాన్స్‌‌ వేస్తున్నారు. ఆయుష్‌‌మాన్ ఖురాన్‌‌ నటించిన మూవీ బాలా, హౌస్‌‌ఫుల్ 4, జడ్జిమెంటల్ హై క్యా, భారత్ గల్లీ బాయ్, డ్రీమ్ గర్ల్ వంటి సినిమాలు తమ మ్యూజిక్‌‌ను టిక్‌‌టాక్‌‌లో పెట్టుకునేందుకు యూజర్లకు అనుమతి ఇస్తున్నాయి. ఆ సినిమాల్లో పాటలతో యూజర్లు వీడియోలు చేసుకుని, టిక్‌‌టాక్‌‌లో పోస్ట్ చేసుకోవచ్చు. దీంతో అటు సినిమా ప్రమోట్ అవుతుంది.. పాపులారిటీకి పాపులారిటీ వచ్చేస్తోందని బాలీవుడ్ ప్రమోటర్ల భావన.

జడ్జిమెంటల్ హై క్యా సినిమాలోని ముఖ్య నటీనటులు కంగనా రనౌత్, రాజ్‌‌కుమార్ రావులు టిక్‌‌టాక్ ఇన్‌ఫ్లుయెన్షియర్స్ తో కలిసి వీడియోలను తీస్తున్నారు. బైట్‌‌డ్యాన్స్‌‌కు చెందిన సోషల్ నెట్‌‌వర్కింగ్ యాప్‌‌ అయిన టిక్‌‌టాక్.. ఇప్పటికే చాలా మంది ఆడియెన్స్‌‌కు రీచ్ అయింది. టిక్‌‌టాక్‌‌లో  కేవలం వీడియోలు చూడటమే కాకుండా.. చాలా మంది కొత్త కొత్త ఇన్నోవేట్ ఐడియాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇంటరాక్షన్స్‌‌ ఉంటున్నాయి. ‘లైకింగ్, షేరింగ్, కామెంటింగ్‌‌కు అదనంగా టిక్‌‌టాక్‌‌లో ఆర్టిస్ట్‌‌లు, మ్యూజిక్‌‌తో ఎంగేజ్ అయి యూజర్లు సొంత వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు’ అని బైట్‌‌డ్యాన్స్ అధికార ప్రతినిధి చెప్పారు.గతేడాది థియేటర్లలోకి వచ్చిన షారుఖ్ ఖాన్‌‌ జీరో సినిమా తొలిసారి తమ ప్లాట్‌‌ఫామ్‌‌తో భాగస్వామ్యమై.. టిక్‌‌టాక్‌‌లో ఆ మూవీకి చెందిన డైలాగ్స్, షార్ట్‌‌ వీడియోలను ప్రమోట్ చేసిందని చెప్పారు. మా యూజర్లు  కేవలం కంటెంట్‌‌ను మాత్రమే వినియోగించకుండా.. కొత్తదనాన్ని కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇన్‌ఫ్లుయెన్షియర్స్ మార్కెట్ రూ.1,067 కోట్లు….

టిక్‌‌టాక్‌‌లో మూవీ ప్రమోషన్లు కేవలం పార్టనర్‌‌‌‌షిప్‌‌లాగానే చేయాలి. కంటెంట్‌‌ను షేర్ చేయాలి. క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్షియర్స్ కూడా తమ పర్సనల్ టిక్‌‌టాక్ అకౌంట్ల ద్వారా బ్రాండ్ ప్రమోషన్లు చేపడుతూ మనీని సంపాదించుకుంటున్నారు. ఇండియాలో ఇన్‌ఫ్లుయెన్షియర్స్ మార్కెట్ ఏడాదికి 75 మిలియన్ డాలర్ల(రూ.533 కోట్లు) నుంచి 150 మిలియన్ డాలర్లుగా(రూ.1,067 కోట్లు) ఉంటుందని అంచనా. గ్లోబల్ మార్కెట్ 1.75 బిలియన్ డాలర్లుగా(రూ.12,459 కోట్లుగా) ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

డిజిటల్ మీడియా వైపే సినీ ప్రమోషన్…

సినీ ఇండస్ట్రీ వారు కూడా ట్రెడిషియన్ అడ్వర్‌‌‌‌టైజింగ్ల నుంచి బయటికి వచ్చేస్తున్నారు. డిజిటల్ మీడియాలోనే ఎక్కువగా మార్కెటింగ్, ప్రమోషనల్ క్యాంపెయిన్లు చేపడుతున్నారు. ఈ డిజిటల్ మీడియాలో టిక్‌‌టాక్​ ఎమర్జింగ్ ప్లాట్‌‌ఫామ్‌‌గా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. సినిమా ప్రమోషన్లలో తక్కువ మార్కెటింగ్‌‌ టైమ్‌‌లోనే ఎక్కువ మందిని చేరుకోవడానికి టిక్‌‌టాక్ పర్‌‌‌‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని మీడియాకామ్ సౌతాసియా సీఈవో నవీన్ ఖెమ్కా చెప్పారు. అయితే ఈ యాప్‌‌ ద్వారా పోర్నోగ్రఫీ, వయోలెన్స్ వ్యాప్తి చెందుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. ఇండియాలో 27.76 కోట్ల డౌన్‌‌లోడ్స్‌‌ను ఈ యాప్ సొంతం  చేసుకుంది.

సోషల్ మీడియా యాప్స్ ద్వారా బ్రాండ్ల ప్రమోషన్….

దేశంలో ఇంటర్నెట్ పెనట్రేషన్ బాగా పెరగడంతో, బ్రాండ్ల ప్రమోషన్ల కోసం కూడా ఎక్కువ సమయం వెచ్చించాల్సినవసరం రావడం లేదు. బోట్, వావ్ స్కిన్ సైన్సస్, మామాఎర్త్‌‌, లైఫ్‌‌లాంగ్ లాంటి డిజిటల్ ఫస్ట్ బ్రాండ్స్‌‌  లాంచ్ అయిన 24 నుంచి 36 నెలల్లోనే రూ.100 కోట్ల రెవెన్యూను తాకే అవకాశం ఉంటుందని ఇన్వెస్టర్లు చెప్పారు. అంతకుముందు ఈ సమయం ఐదేళ్లుగా ఉండేదని తెలిపారు. అమెజాన్, బిగ్‌‌బాస్కెట్ లాంటి ఈకామర్స్ కంపెనీలు తమ బ్రాండ్లను టెస్ట్ చేయడం, లాంచ్ చేయడం కోసం ఎక్స్‌‌క్లూజివ్ ప్రొగ్రామ్‌‌లను చేపడుతున్నాయి. అదనంగా సోషల్ మీడియాలో యాప్స్‌‌ టిక్‌‌టాక్, వాట్సాప్, ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా బ్రాండ్ల ప్రమోషన్ ఎక్కువగా జరుగుతోంది.

ఎక్స్‌‌క్లూజివ్ మ్యూజిక్ లాంచ్‌‌లూ దీనిపైనే

ఇప్పుడు చాలా ఫిల్మ్స్‌‌ నుంచి కోలాబోరేషన్స్ కోసం  రిక్వెస్ట్‌‌లు వస్తున్నాయని, ఇండివిడ్యువల్ ఆర్టిస్ట్‌‌లు తమ ప్లాట్‌‌ఫామ్‌‌పై ఎక్స్‌‌క్లూజివ్‌‌గా మ్యూజిక్‌‌ను లాంచ్ చేస్తున్నారని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఇతర డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌‌పై లైవ్‌‌గా వెళ్లేకంటే ముందే తమ ప్లాట్‌‌ఫామ్‌‌పై సాంగ్‌‌ను విడుదల చేసేందుకు ఆర్టిస్ట్‌‌లు కోరుకుంటున్నారని తెలిపారు. ఇది తమ ఉత్సుకతను అభివృద్ధి చేసేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు. ‘ ఫిల్మ్‌‌తో కోలాబోరేషన్స్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారు. ఎందుకంటే టిక్‌‌టాక్‌‌ అనే ప్లాట్‌‌ఫామ్‌‌కు కంటెంట్ కావాలి. మూవీలకు పెద్ద మొత్తంలో రీచ్ కావడం కావాలి’ అని  డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్‌‌‌‌టైజింగ్ ఏజెన్సీ టోనిక్ వరల్డ్‌‌వైడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుదిష్ బాలన్ చెప్పారు. విల్‌‌ స్మిత్, రీస్‌‌ వెథర్‌‌‌‌స్పూన్ వంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు టిక్‌‌టాక్‌‌లో ఎక్కువ యాక్టివ్​గా ఉంటున్నారు.