తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటళ్లలో శాంపిల్స్ సేకరణ

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటళ్లలో శాంపిల్స్ సేకరణ

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కల్తీ ఫుడ్​ ను విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పలు ప్రయివేటు హోటల్లలో ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు.  రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులుతనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా విఐపిలు ఉండే సన్నిదానం, పద్మావతి ఏరియా, బస్టాండు ప్రాంతాలలో హోటల్స్ ను తనిఖీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.  సేకరించిన ఆహారపదార్దాలను  నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్​ కు పంపుతామని తెలిపారు.  ఈ మధ్యకాలంలో  ఐస్ క్రీం తిన్న భక్తులకు  ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

శ్రీవారి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలలోని హోటళ్లులో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, తినుబండారాల దుకాణాల నుంచి ఆహార నమూనాలను సేకరించారు. వాటిని నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. 

 ఐస్‌క్రీమ్‌లు, తాగునీరు, పాలు వంటి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని హోటల్స్ లలో శాంపుల్స్ కలెక్ట్ చేసినట్లు  ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తెలిపారు. శాంపుల్స్ పరిశీలనకు పంపామమని… ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకపోతే  కచ్చితంగా ఆ హోటల్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు.  తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.