భక్తుల చెంతకే తిరుమలేశుని ప్రసాదం

భక్తుల చెంతకే తిరుమలేశుని ప్రసాదం

తిరుపతి లడ్డు అమ్మకాలపై టీటీడీ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తుల చెంతకే తీసుకెళ్లి అమ్మేలా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కడప జిల్లాలోని టీటీడీ కార్యాలయానికి తిరుమల నుంచి 20 వేల లడ్డూలను తరలించారు. తిరుమలేశుని లడ్డూ ప్రసాదం కోసం ఉదయం నుంచే భక్తులు భారులు తీరారు. ఒక లడ్డూను రూ. 25కు భక్తులకు అందించారు. దీని కోసం రెండు  కౌంటర్లు ఏర్పాటు చేశారు. లడ్డూల పంపిణీలో సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు టీటీడీ అధికారులు.

లాక్ డౌన్ లో భాగంగా తిరుమలకు వెళ్లలేని భక్తుల దగ్గరకే వెళ్లికి వారికి శ్రీవారి లడ్డూల పంపిణీకి శ్రీకారం చుట్టింది టీటీడీ. ప్రతీ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డు ప్రసాదం అమ్మకాల కేంద్రాలు ఏర్పాటు చేసింది. అడ్డు అమ్మకాల్లో ఎలాంటి లిమిట్ లేదని తెలిపింది…భక్తులు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చని తెలిపింది టీటీడీ.