ఫాల్తాలో పోటీ నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి.. రీపోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు జహంగీర్ ఖాన్ నామినేషన్ విత్ డ్రా

ఫాల్తాలో పోటీ నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి.. రీపోలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందు జహంగీర్ ఖాన్ నామినేషన్ విత్ డ్రా

ఫాల్తా: బెంగాల్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 21న  రీపోలింగ్ జరగనున్న ఫాల్తా నియోజకవర్గంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రచారంలో ‘పుష్పరాజ్.. తగ్గేదే లే’ అంటూ పార్టీలకు సవాల్ విసిరిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తన నామినేషన్‌‌‌‌‌‌‌‌ను విత్ డ్రా చేసుకున్నారు. మంగళవారం ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ బీజేపీకి ఏకపక్షంగా గెలిచే అవకాశం లభించింది. జహంగీర్ ఖాన్ నిర్ణయంతో టీఎంసీ హైకమాండ్ వెంటనే అప్రమత్తమైంది. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని పార్టీకి దీనితో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఫాల్తాలో బీజేపీ భయాందోళనలను సృష్టించిందని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి మాత్రం జహంగీర్ ఖాన్‌‌‌‌‌‌‌‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకరని గ్రహించే ‘పుష్ప’ భయపడి పారిపోయారని ఎద్దేవా చేశారు. తన నామినేషన్ విత్ డ్రా నిర్ణయాన్ని జహంగీర్ ఖాన్ సమర్థించుకున్నారు. పాల్తా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని, నియోజకవర్గానికి సీఎం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ తనను ప్రభావితం చేసిందని తెలిపారు.