హైదరాబాద్, వెలుగు: మోడల్ స్కూల్ టీచర్లకు ‘010’ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను టీఎంఎస్టీఏ స్టేట్ ప్రెసిడెంట్ భూతం యాకమల్లు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది.
టీచర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. టీచర్ల సమస్యలను త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
