టెట్​ ఇయ్యాల్నే

టెట్​ ఇయ్యాల్నే
  • పొద్దుగాల పేపర్ 1.. పగటీలి పేపర్ 2 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తం గా ఆదివారం టీచర్​ ఎలిజబిలిటీ టెస్ట్​ (టెట్​) జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్​ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్​ 2 పరీక్ష జరగనుంది. టెట్​కు మొత్తం 3,80,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్​ 1కు 3,51,468 మంది, పేపర్​2కు 2,77,884 మంది అప్లై చేశారు. వీరికోసం 1,480 సెంటర్లను ఏర్పా టు చేశారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. తమ ఏరియాలో నెట్​ సౌకర్యంలేక అప్లై చేయలేకపోయామని పలు జిల్లాల కు చెందిన 17 మంది హైకోర్టును ఆశ్రయించారు. వారు టెట్​ రాసేందు కు కోర్టు పర్మిషన్​ ఇచ్చింది. ఈసారి నుంచి టెట్​ క్వాలిఫై అయితే జీవితాంతం వ్యాలిడిటీని కల్పించారు. దాంతోపాటు బీఈడీ అభ్యర్థులకు పేపర్​ 1 రాసే అవకాశమిచ్చారు. టెట్ పూర్తయిన తర్వాత టీఆర్టీ నిర్వహిస్తారు.