టాలీవుడ్ ప్రముఖ నటి. ..సంక్రాంతికి వస్తున్నాం.. మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి చేరుకున్న నటికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు వేదఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామి..అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేసారు.
