ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా.. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్‌లో ఈనెల 19వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని.. మెట్రో,MMTSలలో రావాలని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. HMDA పార్కింగ్‌ స్థలంలో వాహనాలకు పార్కింగ్‌ అనుమతిచ్చారు. వృద్ధులు, నడవలేని వారి వాహనాలకు మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిచ్చారు. ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.

ఖైరతాబాద్ లో ఈ ఏడాది 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు.