సిగాచిలోనే  ప్రేమ, పెండ్లి,మృత్యువు..నవదంపతులు నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య విషాదాంతం

సిగాచిలోనే  ప్రేమ, పెండ్లి,మృత్యువు..నవదంపతులు నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య విషాదాంతం
  • ఉద్యోగంలో స్నేహం..ప్రేమగా మారింది
  • పెద్దలను ఒప్పించి నెల కిందే పెండ్లి చేసుకున్నరు
  • ఆషాఢం తరువాత రిసెప్షన్​కు ప్లాన్, అంతలోనే మృత్యు ఒడికి

సంగారెడ్డి, వెలుగు: పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో ఏపీకి చెందిన నవదంపతులు నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య మృతిచెందారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న వీరిద్దరూ ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి నెల కిందనే వివాహం చేసుకు న్నారు. ఆషాఢమాసం తర్వాత బంధువులు, స్నేహి తుల సమక్షంలో రిసెప్షన్ ​చేయాలని నిర్ణయించారు. అయితే, ఏ ఫ్యాక్టరీలోనైతే వీరి ప్రేమ చిగురించి, పెండ్లికి దారితీసిందో, అదే ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో వీరిద్దరినీ కబలించింది.

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఒక చిన్న గ్రామానికి చెందిన నిఖిల్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేసి సిగాచి ఫార్మా కంపెనీలో చేరాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో పుట్రెల గ్రామంలో సౌత్ మాలపల్లికి చెందిన శ్రీర మ్య కూడా ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఆమె కూడా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించింది. వీరిద్దరూ అడ్మి నిస్ట్రేషన్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విధులు నిర్వహిస్తున్నారు. కొన్నాళ్లకు వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి నెల రోజుల కింద పెండ్లి చేసుకున్నారు. సోమవారం జరిగిన ప్రమా దంలో నవదంపతులిద్దరు మృతిచెందడం ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

బస్సు లేటవడంతో 20 మంది సేఫ్

ఈ ప్రమాదం నుంచి 20 మంది ఉద్యోగులు ప్రాణాలు దక్కించుకున్నారు. ఫస్ట్ షిఫ్ట్  కార్మి కులను పరిశ్రమకు తీసుకొచ్చే ఫ్యాక్టరీ బస్సు.. ఘటన జరిగిన రోజు 10 నిమిషాలు ఆలస్యం గా వచ్చింది. ఆ ఆలస్యమే బస్సులో ఉన్న 20 మంది ఉద్యోగుల ప్రాణాలను కాపాడింది. ఉదయం 9.10 గంటలకు కంపెనీలోకి రావాల్సిన బస్సు 9.20 గంటలకు చేరుకుంది. బస్సు సరిగ్గా కంపెనీ గేటులోకి వచ్చిన టైంలోనే పేలుడు సంభవించింది. ఆ ధాటికి బస్సు అద్దాలు పగిలిపోయి 8 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి.