హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు విడాకుల వరకు వచ్చింది. పెద్ద మనుషులు కలపాలని ప్రయత్నించినా లాభం లేకపోవడంతో విడిపోవడమే అంతిమ నిర్ణయం అయ్యింది. దీంతో వరకట్నం సెటిల్మెంట్ చేసుకుని విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ సెటిల్మెంట్ కు డబ్బులు లేక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబ సభ్యులను దుఖసాగరంలో ముంచి వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి లో పోలీస్ స్టేషన్ పరిధిలో సెటిల్మెంట్ కు డబ్బులు లేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకవ్ .. అల్వాల్‌కు చెందిన మేఘన 2024లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
దీంతో మేఘన భర్త జాకబ్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పెద్దమనుషుల సమక్షంలో సెటిల్మెంట్‌కు ప్రయత్నాలు జరిగాయి. చివరికి డబ్బు చెల్లించి విడాకులు తీసుకోవాలని ఇరువర్గాల నిర్ణయించుకున్నారు. అయితే సెటిల్మెంట్ కోసం డబ్బులు సమకూర్చుకోలేక జాకవ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఉన్న జాబ్ వదిలేసి వేరే జాబ్ చూసుకోవాలని భార్య వత్తిడితో జాబ్ వదిలేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కు, సెటిల్మెంట్ కు డబ్బులు కట్టలేక తీవ్ర మనస్థాపం గురి అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలిసిన వారి వద్ద అప్పు కోసం ప్రయత్నించి.. ఎవరూ సాయం చేయకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు విచారణ జరుపుతున్నారు.
