తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ మీద బీజేపీ నేతలు ఆబండాలు వేస్తున్నారన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. ఇక్కడకి వచ్చిన బీజేపీ సీఎంలు తమ రాష్ట్రాల అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. తెలంగాణ కంటే ఎందులో అభివృద్ధి సాధించారో చెప్పాలన్నారు. రైతు భీమా, రైతుబంధు, ఆసరా పెన్షన్, కళ్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. బీజేపీ అంటే ప్రజా వ్యతిరేక పార్టీ అని వినోద్ కుమార్ విమర్శించారు. తెలంగాణ రాకముందు ఏడారిలా ఉండేదని..ఇవాళ ప్రాజెక్టులతో మూడేళ్లు కరవు వచ్చినా రాష్ట్రానికి ఏం కాదన్నారు. ఆడవాళ్లు బంగారాన్ని బ్యాంక్ లాకర్లో దాచినట్టుగా..కేసీఆర్ నీళ్లను భూమిలో దాచిండన్నారు. భూమిలో 500 టీఎంసీల నీళ్లు ఇంకించిండన్నారు.
