రాష్ట్రంలో స్థానిక సంస్థల MLC ఎన్నికలకు TRS పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ స్థానిక సంస్థలకు బై ఎలక్షన్ జరగనుంది. వరంగల్ లో కొండా మురళి, రంగారెడ్డి నుంచి పట్నం నరేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో.. నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు గులాబీ బాస్.
మూడు శాసనమండలి స్థానాలకు నామినేషన్ల దాఖలుకు ఎల్లుండి వరకు టైమ్ ఉంది. 15న నామినేషన్ల పరిశీలన, 17న విత్ డ్రా, ఈ నెల 31న ఎన్నికలు జరపనున్నారు. ఈ నెలాఖరున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.