ట్రంప్ కంటే ముందంజ‌లో బిడెన్

ట్రంప్ కంటే ముందంజ‌లో బిడెన్
  • సీఎన్ఎన్ సర్వేలో 14 పాయింట్ల లీడ్
  • ట్రంప్​కు 41%.. బిడెన్​కు 55% ఓట్లు
  • యూత్​ను ఆకట్టుకోవడంలో మాత్రం వెనుకంజ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న డెమొక్రాటిక్​ పార్టీ నామినీ జో బిడెన్.. తాజా సర్వేల్లో ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ కంటే ముందున్నారు. సీఎన్ఎన్ కోసం ఎస్ఎస్ఆర్ఎస్ జరిపిన సర్వేలో ట్రంప్​ కంటే ఎక్కువ లీడ్​లో ఉన్నారు. దేశవ్యాప్త సర్వేలో ట్రంప్​కు 41 శాతం ఓట్లు వస్తే.. బిడెన్​కు 55 శాతం ఓట్లతో మాంచి లీడ్​లో ఉన్నారు. ట్రంప్​ మద్దతుదారుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు తిరిగి ట్రంప్​ను రీఎలెక్ట్​ చేస్తామని చెప్పారు. ఎందుకంటే తాము ట్రంప్​ కు మద్దతిస్తున్నాం కాబట్టీ ఆయనకే ఓటు వేస్తామని చెప్పారు. ఇక 27 శాతం మంది బిడెన్​కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. బిడెన్​ ఓటర్లలో 37 శాతం మంది మాత్రమే ప్రోబిడెన్ ప్లాన్​కు ఓకే చెప్పారు. 60 శాతం మంది ట్రంప్​కు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. ఆదివారం రిలీజ్​ చేసిన ఎన్బీసీ న్యూస్/వాల్​స్ట్రీట్​ జర్నల్​ పోల్​లో కూడా బిడెన్​ ముందంజలో ఉన్నారు. బిడెన్​కు 49 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్​కు 42 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ సీఎన్ఎన్ సర్వేలో బిడెన్​ 50 శాతం మార్కును తాటారు. 2016 ఎన్నికల క్యాంపెయిన్​ టైమ్​లో ట్రంప్​ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నేషనల్​ పోల్స్​ లో ఈ ఫీట్​ సాధించలేకపోయారు. యూత్​ను ఆకట్టుకోవడంలో బిడెన్​ బాగా వెనుకబడ్డాడు. యువ ఓటర్లలో ఎగ్జయిట్​మెంట్​ తీసుకురావడంలో ఆయన ఫెయిల్​ అవుతున్నారు. ఈ విషయంలో బిడెన్​ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.