సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌గా దూసుకెళ్తోంది త్రిష. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె.. త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మలయాళ చిత్రం ‘ఐడెంటిటీ’కి సంబంధించి తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేసింది త్రిష. టోవినో థామస్‌కు జంటగా ఇందులో ఆమె నటిస్తోంది.
త్రిష షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా ఆమెకు థ్యాంక్స్ చెబుతూ షూటింగ్ స్పాట్‌లో దిగిన ఫొటోను దర్శకుడు అఖిల్ పాల్ షేర్ చేశాడు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక మోహన్ లాల్‌కు జంటగా ‘రామ్’ అనే మలయాళ చిత్రంలో త్రిష నటిస్తోంది. ఇటు తెలుగులో చిరంజీవికి జంటగా ‘విశ్వంభర’లో నటిస్తున్న ఆమె, మరోవైపు తమిళంలో కమల్ హాసన్‌కు జంటగా ‘థగ్ లైఫ్’, అజిత్‌తో ‘విదా ముయార్చి’ సినిమాలు చేస్తోంది. మొత్తానికి పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది త్రిష.
