TSNPDCL : టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ కు రెండు స్కోచ్​ అవార్డులు

TSNPDCL : టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ కు రెండు స్కోచ్​ అవార్డులు

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ​(TSNPDCL ) రెండు స్కోచ్​ అవార్డులను గెలుచుకుంది. జీపీఆర్​ఎస్​ ఎనెబుల్డ్​ ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్డింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ ఎనర్జీ​ విభాగాల్లో ఈ  ఆవార్డులు దక్కాయి. ఈ విషయాన్ని స్కోచ్​ వైస్ చైర్మన్​ గురుశరణ్​ దంజల్ వెల్లడించారు.

టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌​కు రెండు అవార్డులు దక్కడం పట్ల  ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్నమనేని గోపాలరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌​కు అన్ని విభాగాల్లో  అవార్డులు వస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్​, మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్​రావు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. వారి ముందు చూపుతోనే రాష్ట్రం వెలుగుల రాష్ట్రంగా అవతరించిందని కొనియాడారు.