గాంధీ భవన్ లో రైతు సంక్షేమ దీక్ష ప్రారంభం

గాంధీ భవన్ లో రైతు సంక్షేమ దీక్ష ప్రారంభం

హైదరాబాద్ : పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రైతు సంక్షేమ దీక్ష చేపట్టిన‌ట్లు తెలిపింది రాష్ట్ర‌ కాంగ్రెస్‌ పార్టీ. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లు పొన్నం, రేవంత్ , ఇతర ముఖ్య నేతలు దీక్షలో చేస్తుండగా, ఆయా జిల్లాలో పార్టీ అధ్యక్షులు, నేతలు దీక్ష చేప‌ట్టారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష ఉంటుంద‌ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ‌రెడ్డి ప్రకటించారు.

అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టిన‌ట్లు ఆయన తెలిపారు. దీక్ష సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని కాంగ్రెస్ కార్య‌కర్త‌ల‌ను కోరామ‌న్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులను, సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.