రెయిన్ అలర్ట్ ఇచ్చే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్

రెయిన్ అలర్ట్ ఇచ్చే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్
  •     త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు బల్దియా ప్లాన్
  •     ఇందుకోసం ఎన్ డీఎంఏను రూ.50 కోట్లు కోరిన జీహెచ్ఎంసీ
  •     ఎన్నికల కోడ్​ముగియగానే ఫండ్స్​వచ్చే చాన్స్
  •     బంజారాహిల్స్ సీసీసీ నుంచి ఆపరేషన్స్

హైదరాబాద్, వెలుగు: ముందస్తుగా వర్ష సూచన ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ త్వరలో ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ సిస్టమ్​సిటీ పరిధిలో ఎప్పుడు వర్షం పడుతుందో ముందుగా చెబుతూ.. ఏయే ప్రాంతాలు ముంపుకు గురవుతాయో, ఏయే ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలో తెలియజేస్తుంది. వర్ష పాతం అంచనా వివరాలను సిటిజన్స్​ఫోన్లకు మెసేజ్​రూపంలో అందిస్తుంది. ఈ సిస్టమ్​ఏర్పాటుకు రూ.50 కోట్లు కావాలని 5 నెలల కింద జీహెచ్ఎంసీ అధికారులు నేషనల్​డిజాస్టర్​మేనేజ్​మెంట్​అథారిటీ(ఎన్​డీఎంఏ)కు ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్​అమలులోకి రావడంతో ఫండ్స్​లేట్​అయ్యాయి. కోడ్ ముగిసిన వెంటనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫండ్స్​అందిన వెంటనే ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు సంబంధించిన పనులు మొదలుపెట్టనున్నారు. వర్షాకాలంలో ఈ సిస్టమ్​ఎంతో ఉపయోగపడుతుందని బల్దియా అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

పెరిగిన వెదర్​స్టేషన్లు

‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ ని రూపొందించాలని బల్దియా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారానే ప్రజలకు మెసెజ్ లు అందనున్నాయి. ఇందుకోసం లేటెస్ట్ మ్యాప్ ని సేకరిస్తున్నారు. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ను బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ నుంచి ఆపరేట్ చేయాలని నిర్ణయించారు. సిటీ వెదర్​కు సంబంధించిన వివరాలు ఇక్కడి నుంచే అందనున్నాయి. అలాగే జీహెచ్ఎంసీ ఇటీవల గ్రేటర్ లో వెదర్ స్టేషన్లను పెంచింది. గతేడాది వరకు 127 స్టేషన్లు ఉండగా, తాజాగా160కి పెంచింది.

వర్షం పడే వరకు తెలియట్లే..

గ్రేటర్ పరిధిలో ఎప్పుడు వర్షం పడుతుందో జనానికి సమాచారం ఉండటం లేదు. ఐఎండీ, తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీలు వర్షానికి సంబంధించిన సమాచారం ఇస్తున్నప్పటికీ ప్రజలకు చేరడం లేదు. ఎన్ని విధాలుగా అలెర్ట్ చేసినా చాలా మంది వాటిని తెలుసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మొబైల్ కు మెసేజ్​రూపంలో అందించాలని, భారీ వర్షాలప్పుడు అలర్ట్​చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.