మే నెలాఖరులో ఎంసెట్ రిజల్ట్స్ !

మే నెలాఖరులో ఎంసెట్ రిజల్ట్స్ !

మరో 15( మే నెలాఖరు) రోజుల్లో ఎంసెట్  ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించారు. మే 15న ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డిన్ కుమార్ తెలిపారు. మే 15న రాత్రి 8 గంటల నుంచి.. 17 వ తేదీ సాయంత్రం 8 గంటలకు ఎంసెట్ వెబ్ సైట్ లో ప్రిలిమినరీకీ అందుబాటులో ఉంటుందని కన్వీనర్ చెప్పారు. ఈ ఎంసెట్ కీలో విద్యార్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే.. వెబ్ సైట్ లో తెలపాలని అధికారులు వెల్లడించారు. 

మే 10 నుండి మే 14 వరకు ఐదు రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు  జరిగాయి. ఇందులో భాగంగా  మే10, 11వ తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించారు. మే12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజులు పాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి.

ఈ ఎంసెట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో  జరిగాయి. పరీక్షల కోసం తెలంగాణలో 104 కేంద్రాలు, ఏపీలో 33 కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించిన ఈ ఎంసెట్ పరీక్షల కోసం 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.