శ్రీశైలం ప్రమాదం: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

శ్రీశైలం ప్రమాదం: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ధిక సహాయం ఇతరత్రా సహాయలు ప్రకటించారు. మరణించిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షలు. మిగతా వారందరి కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్లు సీఎం చెప్పారు.మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు అందిస్తామని సీఎం వెల్లడించారు.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా.. వారిలో అమర రాజా అనే బ్యాట‌రీ కంపెనీ ఉద్యోగులు మహేశ్, వినేష్ కూడా ఉన్నారు. అంతకుముందు ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్), ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ), ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ), ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట) ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా) , జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ) హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.