రైల్వే అసిస్టెంట్ లోకోపైలెట్ ఎగ్జామ్‌‌‌‌కు డిజిటల్ లెసన్స్ : టీసాట్ సీఈవో వేణుగోపాల్రెడ్డి 

రైల్వే అసిస్టెంట్ లోకోపైలెట్ ఎగ్జామ్‌‌‌‌కు డిజిటల్ లెసన్స్ : టీసాట్ సీఈవో వేణుగోపాల్రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: రైల్వే రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు డిజిటల్​ కంటెంట్ అందిస్తామని టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​రెడ్డి తెలిపారు. మన రాష్ట్ర యువత ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్‌‌‌‌ను డిజిటల్ లెసన్స్ ద్వారా సోమవారం నుంచి సెప్టెంబర్​ వరకు అందిస్తామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గణితం, మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ సైన్స్‌‌‌‌కు సంబంధించిన సబ్జెక్టులలో సుమారు 300 గంటల కంటెంట్‌‌‌‌ను రోజూ రెండు గంటల చొప్పున ప్రసారం చేస్తామని చెప్పారు. టీసాట్ విద్య చానెల్‌‌‌‌లో ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు, నిపుణ చానెల్‌‌‌‌లో రాత్రి 9 నుంచి 11 గంటల వరకు రిపీట్​ చేస్తామని తెలిపారు. రైల్వే అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాలకు అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే పరీక్ష కోసం సెప్టెంబర్ వరకు డిజిటల్ లెసన్స్ ప్రసారమౌతాయని వెల్లడించారు.