V6 News

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సమస్యలున్నయ్: లింబాద్రి 

న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సమస్యలున్నయ్: లింబాద్రి 
  • ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి 

హైదరాబాద్, వెలుగు: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆ పాలసీలో కొన్ని సమస్యలున్నాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్  ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. 21వ శతాబ్దానికి అవసరమైన విధానాలతో ఆ పాలసీని రూపొందించారని ఆయన చెప్పారు.

శుక్రవారం డాక్టర్  బీఆర్ అంబేద్కర్  ఓపెన్ యూనివర్సిటీలో ‘నూతన విద్యా విధానం–అమలు’ పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింబాద్రి ముఖ్య​అతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త విద్యా విధానంతో ప్రైవేటు యూనివర్సిటీల విషయంలో సమస్యలు వస్తాయన్నారు. విదేశీ వర్సిటీల రాకతో పేద విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.