ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ శనివారం (ఏప్రిల్18) రాత్రి 8.30గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారని పీఎం కార్యాలయం తెలిపింది. అయితే ఏ అంశంపై ప్రసంగిస్తారనేది ఎలాంటి నిర్ధారణ లేదు. లోక్ సభలో మూడు బిల్లులు వీగిపోయిన మరుసటి రోజున ప్రధాని ప్రసంగం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు ప్రధాని మోదీ 2025 సెప్టెంబర్ 21న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజలకు వివరించారు.
ప్రసంగించే అంశంపై ఉత్కంఠ..
ప్రధాని మోడీ ఈ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతినుద్దేశించి ప్రసంగించే అంశం ఏంటనే అంశం ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవటంపై ఉంటుందా లేక అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభాలపై ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.
మహిళా రిజర్వేషన్ బిల్లును.. డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టటంతో వ్యతిరేకించిన ప్రతిపక్షాలు.. ఓటింగ్ సమయంలో వ్యతిరేకంగా ఓటు వేశాయి. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ అంశంపై మాట్లాడతారా లేక మరో అంశం ఏదైనా ఉందా అనేది జనంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
ALSO READ : మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు NDA ప్రభుత్వం కుట్ర
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు, లోక్‌సభలోని సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 816కు పెంచడమే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లక్ష్యం. ఈ చట్టానికి 298 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఓటు వేసిన 528 మంది సభ్యులలో, మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించడానికి 352 ఓట్లు అవసరం కావడంతో ఆ బిల్లు వీగిపోయింది.

