V6 News

సరికొత్త టీ20 టోర్నీకి శ్రీకారం చుట్టిన ఐసీసీ.. భారత్కు మాత్రం నో పర్మిషన్ 

సరికొత్త టీ20 టోర్నీకి శ్రీకారం చుట్టిన ఐసీసీ.. భారత్కు మాత్రం నో పర్మిషన్ 

ICC Women's T20I challenge: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళల క్రికెట్ వ్యాప్తి కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జై షా నేతృత్వంలోని ఐసీసీ, 2026 మహిళల T20 ప్రపంచకప్‌కు ముందు 'ఐసీసీ ఉమెన్స్ T20 ఛాలెంజ్' అనే సరికొత్త టోర్నమెంట్‌ను ప్రకటించింది. అయితే, ఈ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు ఆడేందుకు అవకాశం మాత్రం లేదని పేర్కొనింది. ఈ టోర్నీని నిర్వహించడం వెనుక ప్రధాన ఉద్దేశం అసోసియేట్ (Associate) దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్‌పోజర్ కల్పించడం.. అందుకే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లను ఈ లీగ్ కి దూరంగా ఉంచారు.

రువాండాలోని కిగాలీ వేదికగా ఏప్రిల్ 18వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో రువాండా, ఇటలీ, నేపాల్, అమెరికా, వనౌటు దేశాలు మాత్రమే పాల్గొంటాయి. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. డబుల్ రౌండ్- రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. అంటే ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. మొత్తం 20 మ్యాచ్‌లు కిగాలీలోని గహంగా క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి.

వరల్డ్ కప్ వేటలో టీమిండియా: 
ఒకవైపు ఈ కొత్త టోర్నీ జరుగుతుండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోంది. గత ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి నిరాశపరిచిన భారత్, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల సొంత గడ్డపై తొలిసారి ప్రపంచకప్ (వైట్ బాల్) సాధించడం, ఆ తర్వాత ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రపంచకప్‌కు ముందు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు టీమిండియా త్వరలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ కూడా ఆడబోతుంది. 

ICC మహిళల T20 ఛాలెంజ్ షెడ్యూల్: 
మ్యాచ్    తేదీ    సమయం
రువాండా vs ఇటలీ    ఏప్రిల్ 18    ఉదయం 9:00
నేపాల్ vs USA    ఏప్రిల్ 18    మధ్యాహ్నం 1:00
రువాండా vs వనౌటు    ఏప్రిల్ 19    ఉదయం 9:00
ఇటలీ vs నేపాల్    ఏప్రిల్ 19    మధ్యాహ్నం 1:00
రువాండా vs USA    ఏప్రిల్ 21    ఉదయం 9:00
వనౌటు vs ఇటలీ    ఏప్రిల్ 21    మధ్యాహ్నం 1:00
రువాండా vs నేపాల్    ఏప్రిల్ 22    ఉదయం 9:00
USA vs వనౌటు    ఏప్రిల్ 22    మధ్యాహ్నం 1:00
నేపాల్ vs వనౌటు    ఏప్రిల్ 24    ఉదయం 9:00
ఇటలీ vs USA    ఏప్రిల్ 24    మధ్యాహ్నం 1:00
రువాండా vs వనౌటు    ఏప్రిల్ 26    ఉదయం 9:00
USA vs నేపాల్    ఏప్రిల్ 26    మధ్యాహ్నం 1:00
రువాండా vs ఇటలీ    ఏప్రిల్ 27    ఉదయం 9:00
USA vs వనౌటు    ఏప్రిల్ 27    మధ్యాహ్నం 1:00
రువాండా vs నేపాల్    ఏప్రిల్ 28    ఉదయం 9:00
ఇటలీ vs వనౌటు    ఏప్రిల్ 28    మధ్యాహ్నం 1:00
ఇటలీ vs USA    ఏప్రిల్ 30    ఉదయం 9:00
నేపాల్ vs వనౌటు    ఏప్రిల్ 30    మధ్యాహ్నం 1:00
రువాండా vs USA    మే 1    ఉదయం 9:00
ఇటలీ vs నేపాల్    మే 1    మధ్యాహ్నం 1:00