V6 News

మహిళలు బైక్‌పై ఒక పక్కకే ఎందుకు కూర్చుంటారు ? దీని వెనుక అసలు కారణాలు ఇవే..

 మహిళలు బైక్‌పై ఒక పక్కకే ఎందుకు కూర్చుంటారు ? దీని వెనుక అసలు కారణాలు ఇవే..

బైక్‌ల మీద వెళ్లేటప్పుడు మహిళలు ఒక వైపునే ఎందుకు కూర్చుంటారు అనే విషయంపై  ఎప్పుడైనా ఆలోచించారా... మన దేశంలో బైక్‌ పై వెనుక కూర్చునే మహిళలు రెండు వైపులా కాకుండా ఒక సైడ్ తిరిగి కూర్చోవడం మనం  సాధారణంగా చూస్తుంటాం. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని సామాజిక, భద్రతా కారణాలు ఉన్నాయి...

మన దేశంలో చాలామంది మహిళలు చీరలు లేదా లాంగ్  డ్రెస్సులు వేసుకుంటుంటారు. అందుకే ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడు టు సైడ్స్ కూర్చోవడం కష్టం కాబట్టి. సమాజంలో మహిళలు కాళ్లు దగ్గరగా పెట్టుకుని ఒక పక్కకే కూర్చోవడాన్ని ఒక మర్యాదగా భావిస్తారు.  

బైక్‌లకు వెనుక వైపు ఒక పక్కనే కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా ఫుట్-రెస్ట్ అలాగే బట్టలు చక్రంలో పడకుండా శారీ గార్డ్  ఉండటం వల్ల, మహిళలు వన్ సైడ్  కూర్చోవడానికి ఇష్టపడతారు. సాంప్రదాయం పక్కన పెడితే, ఇలా ఒక పక్కకు కూర్చోవడం వల్ల కొన్ని ఆరోగ్య, భద్రతా సమస్యలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు లేదా అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు, ఒక పక్కకు కూర్చున్న వారు బండిపై పట్టు కోల్పోయి కింద పడే అవకాశం ఉంది.  

 బండి మలుపులు తిరిగేటప్పుడు ఒక పక్కకే బరువు ఉండటం వల్ల డ్రైవర్ బండిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. గాలికి  చీరలు లేదా దుపట్టాలు చక్రంలో చిక్కుకుని ప్రమాదాలు జరగవచ్చు. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ప్యాంట్లు లేదా లెగ్గింగ్స్ వంటివి వేసుకుని, టు సైడ్స్ కూర్చోవడం సురక్షితం.  

మర్యాద కంటే ప్రాణం ముఖ్యమని గుర్తించి, హెల్మెట్ ధరించడం, సరైన భంగిమలో కూర్చోవడంపై అవగాహన పెంచుకోవాలి. ఒక పక్కకు కూర్చోవడం అనేది మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, ప్రయాణంలో భద్రత అనేది అన్నిటికంటే ముఖ్యం. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, మన ప్రాణాలకు ముప్పు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.