Bumrah, Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కి ఈ సీజన్ లో ఏది కలిసిరావడం లేదు. గురువారం నాడు వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఘెర పరాజయం పాలైంది. ముంబై ఇండియన్స్ కి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ముంబై పాయింట్ల పట్టికలో 8వ రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ముంబై జట్టులో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా- స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
196 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అతడ్ని ఔట్ చేసేందుకు హార్దిక్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయినప్పటికి ఫలితం మాత్రం లభించలేదు. దీంతో పాండ్యా తన సహనాన్ని కోల్పోయాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నప్పుడు హార్దిక్ పదే పదే ఫీల్డర్లను మారుస్తూ విసిగించాడు. తన బౌలింగ్ కి తగ్గట్టుగా ఫీల్డింగ్ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వకుండా, హార్దిక్ జోక్యం చేసుకోవడం బుమ్రాకు నచ్చలేదు..
హార్దిక్ పాండ్యా చేసిన ఓవరాక్షన్ అతడికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. బుమ్రా అసహనంతో నీవు నాకు చెప్పొద్దు అన్నట్లు చేసిన సైగలు చేసినప్పటికీ, ఏదేమైనప్పటికి చివరికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయానికే బుమ్రా తలవంచాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ 2026లో బుమ్రా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ భారత పేస్ గుర్రం ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేదు.
इसकी कप्तानी और एटीट्यूड से आईपीएल मे मुंबई इंडियंस टीम बस एक कोलकाता से आगे है,9 वें नंबर पर... pic.twitter.com/bsH7LS0tHj
— Dinesh Dangi (@dineshdangi84) April 16, 2026

