TSPSC : టీఎస్ పీఎస్సీ కేసు విచారించే అర్హత మాకుంది: ఈడీ

TSPSC : టీఎస్ పీఎస్సీ కేసు విచారించే అర్హత మాకుంది:  ఈడీ

టీఎస్ పీఎస్ సీ(TSPSC) ఇష్యూలో  ఈడీ కేసు నమోదు చేసినట్లు నాంపల్లి కోర్టుకు తెలిపారు అధికారులు. టీఎస్ పీఎస్ సీ కేసుకు సంబంధించిన వివరాలు తమకు ఇవ్వాలని మార్చి 23న సీసీఎస్ ఏసీపీకి లేఖ రాశారు ఈడీ అధికారులు.    ప్రవీణ్ ,రాజశేఖర్ లను విచారణ చెయ్యడానికి కోర్టు అనుమతి కోరారు.  పిఎంఎల్ ఏ సెక్షన్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ వాగ్మూలం రికార్డ్ చెయ్యాలని తెలిపారు.  చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని కోర్టుకు తెలిపారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అభియోగం మోపింది. సెక్షన్ 48, 49 కింద తమకు విచారించే అర్హత ఉందని కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు. జైలులో విచారణ సందర్భంగా లాప్ టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది.  జైలులో విచారణకు  తగిన ఏర్పాట్లు చేసేలా చంచల్ గూడ సూపరింటెండెంట్ కు  ఆదేశాలు ఇవ్వాలని కోరింది.