టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫైనల్ కీ..ఇలా చెక్ చేసుకోండి

టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫైనల్  కీ..ఇలా చెక్ చేసుకోండి

TSPSC  గ్రూప్‌-4 ఫైనల్ కీ రిలీజ్ అయింది. గ్రూప్ 4 పరీక్ష తుది ‘కీ’ ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్ 4 పరీక్షలో  పేపర్‌ 1లో 7 ప్రశ్నలను అధికారులు తొలగించారు.  8 ప్రశ్నలకు ఆప్షన్‌ మార్చారు. అలాగే  పేపర్‌ 2లో 2  ప్రశ్నలు తొలగించారు.  5  ప్రశ్నలకు ఆప్షన్‌ మార్చారు. త్వరలో గ్రూప్ 4 పరీక్షల ఫలితాలను విడుదల చేయనుంది TSPSC. 

ఈ ఏడాది జులై1న  గ్రూప్ 4 పరీక్ష జరిగింది.  ఆగస్టు 28న గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’ విడుదల చేశారు. ఆ తర్వాత ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4  వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత...అక్టోబర్ 6వ తేదీ ఫైనల్ కీ రిలీజ్ చేశారు.