టీఎస్‌పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు..మరో నలుగురు అరెస్టు

 టీఎస్‌పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసు..మరో నలుగురు అరెస్టు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు రోజుకో ములుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్‌సీ  ఏఈఈ పేపర్‌ కూడా లీక్‌ కావడంతో.. ఈ కేసులో సిట్  మ‌రో నలుగురిని అరెస్టు చేసింది. ఈ న‌లుగురు ప్రధాన నిందితుడు ప్రవీణ్ దగ్గర ఏఈఈ పేప‌ర్ ను కొనుగోలు చేసిన‌ట్లు సిట్ గుర్తించింది. వీరితో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 27కి చేరింది. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో మే 8వ తేదీ సోమవారం కూడా ముగ్గురిని  సిట్ అరెస్ట్ చేసింది.  అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్  కొనుగోలు  చేసిన ముగ్గురిని సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.  ఈ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ నుండి  ఈ ముగ్గురు పేపర్ ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. మనోజ్, మురళీధర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని  సిట్  అరెస్ట్  చేసింది. ఏఈఈ ప్రశ్నపత్రాన్ని  రూ.10 లక్షలకు  ప్రవీణ్ విక్రయించారని సిట్ బృందం  గుర్తించింది.