ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ రిలీజ్

సందీప్ కిషన్ హీరోగా సివి కుమార్ దర్శకత్వంలో  వచ్చిన ‘మాయవన్’ చిత్రానికి ఆరేళ్ల  తర్వాత ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో  సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో యాక్షన్‌‌ థ్రిల్లర్‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంగళవారం సందీప్ కిషన్ బర్త్‌‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సందీప్ ఇంటెన్స్ లుక్‌‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు.  తన చేతిలో ఏదో సూపర్ పవర్ ఉన్నట్టు కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు  నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సందీప్ కిషన్, నీల్ ఇద్దరూ యాక్షన్ ప్యాక్డ్ పాత్రలలో కనిపించనున్నారు. సూపర్‌‌విలన్‌‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఉండబోతుందని మేకర్స్ చెప్పారు.  పలు ఓటీటీ సిరీసులతో ఆకట్టుకున్న   ఆకాంక్ష రంజన్‌‌ కపూర్‌‌ ఈ చిత్రంతో  హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తోంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై  రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.