రోహిత్‌‌‌‌‌‌‌‌ తెలివైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ యువరాజ్‌‌‌‌‌‌‌‌

రోహిత్‌‌‌‌‌‌‌‌ తెలివైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ యువరాజ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ ఉండటం చాలా కీలకమని టీమిండియా మాజీ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌, మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌ యువరాజ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ చాలా తెలివైన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అని ఒత్తిడిలోనూ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని ప్రశంసించాడు. రోహిత్‌‌‌‌‌‌‌‌ చేతిలో టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ను చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ‘మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ చాలా కీలకం. ఒత్తిడిలోనూ తెలివైన నిర్ణయాలు తీసుకునే మంచి కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మనకు కావాలి. అలాంటి సవాళ్లను ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం రోహిత్‌‌‌‌‌‌‌‌కు ఉంది.

కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా అతను 5 ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలు సాధించాడు. ఆ అనుభవం ఈ టోర్నీలో చాలా ఉపయోగపడుతుంది’ అని యువీ పేర్కొన్నాడు. ఎన్ని విజయాలు సాధించినా రోహిత్‌‌‌‌‌‌‌‌ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు ఉండదన్నాడు. హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌లో ఉండే బ్యూటీ అదేనన్న యువీ.. సహచర ప్లేయర్లతో ఎప్పుడూ సరదాగా ఉంటాడని కితాబిచ్చాడు. క్రికెట్‌‌‌‌‌‌‌‌లో నాకు ఉన్న అత్యంత ఆప్త మిత్రుల్లో అతను కూడా ఒకడని యువీ తెలిపాడు.