సూర్యను మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో ఆడించాలి: లారా

సూర్యను మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో ఆడించాలి: లారా

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ను టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో ఆడించాలని వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ బ్రియాన్‌‌‌‌‌‌‌‌ లారా సూచించాడు. దానివల్ల ఇండియాకు చాలా మేలు జరుగుతుందన్నాడు. ఇక విండీస్‌‌‌‌‌‌‌‌, ఇండియా ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆడితే చూడాలని ఉందని చెప్పాడు. ‘టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆడబోతున్న టీమిండియాకు నాదో సలహా. దానిని మీరు ఇష్టపడతారో లేదో నాకు తెలియదు. మెగా టోర్నీలో సూర్యను మూడో నంబర్‌‌‌‌‌‌‌‌లో ఆడిస్తే చాలా బాగుంటుంది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ టీ20 ప్లేయర్లలో అతను కూడా ఒకరు.

మిడిల్‌‌‌‌‌‌‌‌లో వచ్చి ఓ 10, 15 ఓవర్లు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ స్వరూపమే మారిపోతుంది. ముందుగా అతన్ని బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దించితే మనపై ఎవరూ దాడి చేయలేనంత సురక్షితమైన ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంచుతాడు. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆడాల్సి వస్తే కచ్చితంగా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిపిస్తాడు. కాబట్టి కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ చేసి సూర్యకు మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌ కేటాయించాలి’ అని పీటీఐ హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎడిటర్స్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో లారా పేర్కొన్నాడు. ఈ టోర్నీలో విండీస్‌‌‌‌‌‌‌‌ కూడా బాగా ఆడుతుందన్న లారా.. తమ టీమ్‌‌‌‌‌‌‌‌లోనూ వ్యక్తిగతంగా స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఉన్నారని వెల్లడించాడు. టీమిండియా నలుగురు స్పిన్నర్ల స్ట్రాటజీపై తాను పెద్దగా మాట్లాడబోనని చెప్పాడు.