హైదరాబాద్‌‌‌‌‌‌‌‌–లక్నో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వర్షం ముప్పు!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌–లక్నో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వర్షం ముప్పు!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: సాఫీగా సాగుతున్న ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–17కు వర్షం ముప్పు పొంచి ఉంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షం కురవడంతో ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం తడిసి ముద్దయ్యింది. దీంతో ప్రధాన పిచ్‌‌‌‌‌‌‌‌పై గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు. అవుట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ మొత్తం వాన నీటితో నిండిపోయింది. నగరంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, లక్నో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. వర్షం వల్ల లక్నో తమ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ను కూడా రద్దు చేసుకుని హోటల్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైంది. లాస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ముంబై చేతిలో ఓడిన సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉండగా, లక్నో ఖాతాలో కూడా సేమ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లే  ఉన్నాయి. దీంతో ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌‌‌‌‌లో ముందుకెళ్లాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అత్యంత కీలకం. మరి కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు వరుణుడు సహకరిస్తాడా? లేదా? చూడాలి.