సిటీలో టీ24 టికెట్ కు మంచి రెస్పాన్స్

సిటీలో టీ24 టికెట్ కు మంచి రెస్పాన్స్

ప్రయాణికులను ఆకర్షించేందుకు టీ24 టికెట్ తీసుకొచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. వంద రూపాయలతో  సిటీలో రోజంతా ట్రావెల్ చేయొచ్చని తెలిపింది . ఈ టికెట్ తో  ఏరూట్ లోనైనా, ఎన్నిసార్లైనా ప్రయాణం చేయొచ్చు. పెట్రోల్ రేట్లు పెరడగంతో.. ఈ టికెట్ ఎంతో ఉపయోగ పడుతుందంటున్నారు ప్రయాణికులు.

సంస్థను లాభాల బాట పట్టించేందుకు చర్యలు చేపట్టింది ఆర్టీసీ యాజమాన్యం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య పెంచేందుకు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారులు.  ఇప్పటికే ఆన్ లైన్ లోనే  ఈ-టికెట్ పొందేలా ఏర్పాట్లు చేశారు.  డిజిటల్ సిస్టమ్ ను ప్రోత్సహించేందుకు వీలుగా బస్టాండ్స్ లో క్యూఆర్ కోడ్ తోనే టికెట్ తీసుకొనేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు సిటీలో రోజంతా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేలా టీ24 టికెట్ ను తీసుకొచ్చింది ఆర్టీసీ.

టీ24 టికెట్ తో ఆర్టినరీ నుంచి ఏసీ బస్సు వరకు ఎన్నిసార్లయినా ప్రయాణించే వీలు కల్పించింది. 100 రూపాయల చార్జీతో టీ24 టికెట్ తీసుకుంటే రోజంతా సిటీలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. టీ24 టికెట్ కు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు ఆర్టీసీ అధికారులు. టీ24 టికెట్ తీసుకునే వారి సంఖ్య పెరిగిందంటున్నారు.

ఆర్టీసీలో ప్రయాణం సేఫ్ అంటున్నారు అధికారులు. పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ఆర్టీసీ బస్సుల్లో వంద రూపాయల్లోనే సేఫ్ గా రోజంతా ట్రావెల్ చేయొచ్చని తెలిపారు. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగడంతో పర్సనల్ వెహికల్స్ కంటే బస్సుల్లో ప్రయాణించడం బెటర్ అని చెబుతున్నారు. సిటీలో ట్రాఫిక్ జామ్స్ కూడా తగ్గించవచ్చని తెలిపారు.