తండ్రి పట్టించుకోవడం లేదని.. తల్లి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన కూతుళ్లు..దామెరచర్లలో ఘటన

తండ్రి పట్టించుకోవడం లేదని.. తల్లి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన కూతుళ్లు..దామెరచర్లలో ఘటన

తల్లి అనారోగ్యంతో చనిపోయింది.. తండ్రి పట్టించుకోవడం లేదు..తమను ఆదుకునేది ఎవరూ.. న్యాయం కావాలంటూ రోడ్డెక్కారు ఇద్దరు ఆడబిడ్డలు..కన్న తండ్రే తమను అనాథలను చేశాడంటూ కన్నీరు పెట్టిన కుమార్తెల ఆవేదన చూసే వారి కంటనీరు పెట్టింది. నల్లగొండ జిల్లా దామెరచర్ల  పట్టణకేంద్రంలో చనిపోయిన తల్లి మృతదేహంతో ఇద్దరు కూతుళ్లు నార్కట్ పల్లి - అద్దంకి హైవేపై ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. 

దామెరచర్లకు చెందిన లక్ష్మీ, శ్రీకాంత్ లు భార్యభర్తలు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆదివారం (మే17) లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబతగాదాలతో గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న లక్ష్మీనుంచి  దూరంగా ఉంటున్నారు భర్త శ్రీకాంత్.  భార్య నుంచి విడాకులకు కోర్టుకు వెళ్లాడు.. ఈ క్రమంలో లక్ష్మీ చనిపోవడంతో ఆమె ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. 

తల్లి చనిపోవడంతో ఆ ఇద్దరు ఆడబిడ్డలు  దిక్కుతోచని స్థితిలో తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. దామెరచర్లలో అద్దంకి, నార్కట్ పల్లి హైవేపై  తల్లిమృతదేహంతో ధర్నాకు దిగారు. తల్లి ఆనారోగ్యంగా ఉంటే కనీసం పట్టించుకోలేదని తండ్రి తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.తండ్రితీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని కన్నీరు మున్నీరయ్యారు. అమ్మ వెళ్లి పోయింది.. మాకు దిక్కెవరు అంటూ ఇద్దరు ఆడబిడ్డలు ఏడుస్తూంటే స్థానికులు, కంటతడి పెట్టారు. తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు.